MBNR: రాష్ట్రంలోని విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. శనివారం ఉన్నత విద్యా మండలి కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేశ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి కోర్టులో కౌంటర్ దాఖలు చేయాలని, నిధుల లేమితో విద్యార్థులు చదువుకు దూరం కాకుండా చూడాలని కోరారు.