WGL: ఉమ్మడి వరంగల్ జిల్లాలో మద్యం దుకాణాల లైసెన్స్ కోసం దరఖాస్తుల స్వీకరణకు ఎక్సైజ్ శాఖ శనివారం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. రెండో శనివారం సెలవు దినమైనప్పటికీ, పంచమి తిథి మంచి రోజుగా భావించడంతో ఔత్సాహికులు ఎక్కువగా దరఖాస్తు చేసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. అందుకే సెలవును రద్దు చేసి దరఖాస్తుల స్వీకరణకు ఏర్పాట్లు చేశారు.