ADB: నార్నూర్ మండలంలోని మహాగావ్ గ్రామానికి చెందిన పోలీస్ కానిస్టేబుల్, సోల్జర్స్ గ్రూప్ వ్యవస్థాపకుడు చౌహన్ కృష్ణకు అరుదైన గౌరవం దక్కింది. ఆయన ఆదివారం హైదరాబాదులోని ఉప్పల్లో గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి చేతుల మీదుగా ‘యూత్ ఐకాన్-2025’ అవార్డును అందుకున్నారు. దీంతో పలువురు ఆయనను అభినందించారు.