MBNR: మూసాపేట పరిధిలో పత్తి సేకరణ సీజన్ ప్రారంభమైంది. రైతులు ప్రస్తుతం కోతకు సిద్ధమైన పత్తిని గోదాముల్లో నిల్వ చేస్తున్నారు. ఈ క్రమంలో వారు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ప్రారంభం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రైవేట్ వ్యాపారులు తక్కువ ధరలు చెబుతుండటంతో, తమ పంటకు మద్దతు ధర లభించాలంటే ప్రభుత్వ కేంద్రాలకే విక్రయించాలని రైతులు నిర్ణయించుకుంటున్నారు.