WGL: నిషేధిత పోగాకు ఉత్పత్తులు అక్రమంగా అమ్ముతున్న ముగ్గురిపై మంగళవారం జిల్లా పోలీసులు కేసులు నమోదు చేశారు. ఖానాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు కేసులు, కాజీపేట పరిధిలో ఒక కేసు నమోదైంది. ఈ దాడుల్లో రూ.18,500 విలువైన గుట్కా, అంబర్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిషేధిత పోగాకు విక్రయిస్తే కఠిన చట్టచర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.