SRCL: దాడి చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేశామని తంగళ్ళపల్లి ఎస్సై ఉపేంద్ర చారి తెలిపారు. కారు వినాయక మండపానికి తగిలిందని శ్యామ్ ఫోన్ చేసి కరుణాకర్‌ను రమ్మన్నాడని అన్నారు. కరుణాకర్ అక్కడికి చేరుకోగానే అతడిపై శ్యామ్ దాడి చేశాడన్నారు. అలాగే నచ్చ చెప్పడానికి ప్రయత్నించిన ప్రశాంత్ రెడ్డిపై కూడా దాడి చేశాడన్నారు. దీంతో కరుణాకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.