NLG: శాలిగౌరారం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ పాదూరి శంకర్ రెడ్డి రైతుల కోసం కీలక సూచనలు చేశారు. రైతులు తమ ధాన్యాన్ని కల్లాల వద్దే 17 శాతం తేమ వచ్చేలా ఆరబోసి మార్కెట్కు తీసుకురావాలన్నారు. మార్కెట్ యార్డులో స్థలం తక్కువగా ఉండటం వల్ల, యార్డులో ధాన్యం ఆరబోయడం వల్ల వందలాది మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.