ADB: జిల్లా కేంద్రానికి చెందిన మైనర్ బాలిక అనారోగ్యంతో ఉండగా, మంత్రాలు, తాయిత్తులతో నయం చేస్తానని నమ్మబలికిన షేక్ కలీం, నిర్మల్ సోన్ నది వద్ద పూజలు చేశాడు. రాత్రి ఇంట్లో బస చేసి, ఒంటరిగా పూజలు చేయాలని నమ్మించి, బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో వన్డేన్ సీఐ సునీల్ కుమార్ నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశాడు.