NRML: తానూర్ మండలం భోల్సా సమీపంలో ఎస్సై జూబేర్ ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. వాహనదారులకు మద్యం పరీక్షలు చేసి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేశారు. మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రాణాంతకమని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పోలీసులు సూచించారు. ఇందులో భాగంగా పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.