KMM: నూకలంపాడులో డ్రైనేజ్ సమస్య ఉందని స్థానికులు చెబుతున్నారు. మురుగు నీరు రోడ్ల మీద ప్రవహిస్తుండటంతో గ్రామంలో జ్వరాల వ్యాప్తి పెరిగిందంటున్నారు. స్థానికుల విన్నపాలు అధికారులు గణనలోకి తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే దృష్టి సారించి, సమస్య తక్షణమే పరిష్కారానికి సహకరించాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.