KRNL: 2009 అక్టోబర్ 2న తుంగభద్ర, హంద్రీ నదుల ఉద్ధృతితో కర్నూలు నగరం తీవ్రంగా దెబ్బతింది. వరదల్లో ఆస్తులు, ఇళ్లు, కొట్టుకుపోగా అనేక కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. వేలాది మంది తమ ఆత్మీయులను, జీవనాధారాలను కోల్పోయారు. ఈ విషాద సంఘటన జరిగి 16 ఏళ్లు గడిచినా, ఆనాటి భయం, బాధలు ఇంకా ప్రజల మనసుల్లో నిలిచిపోయాయి.