NRML: నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండల కేంద్రంలో బస్ షెల్టర్ నిర్మాణంతో ప్రయాణికుల ఇబ్బందులు తీరాయి. గ్రామ సర్పంచ్ అక్షర అనిల్, ఉప సర్పంచ్ సుఖేష్ ప్రత్యేక చొరవతో ఈ సదుపాయం కల్పించారు. ఎండ, వర్షాల సమయంలో ఎదురైన కష్టాలకు ఇప్పుడు ఉపశమనం లభించడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.