RR: చేవెళ్ల ఆర్టీవోగా ఇటీవల నియమితులైన పార్థ సింహారెడ్డి సోమవారం శాసన మండలి చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డిని, హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. ఈ సందర్బంగా పటిష్టమైన ప్రజా పాలనకు తాను ఎల్లవేళలా అండగా ఉంటానని మహేందర్ రెడ్డి తెలిపారు. ప్రజా సమస్యలకు వెంటనే పరిష్కారం చూపాలని కోరారు.