WGL: ఖానాపూర్ మండలం బుధరావుపేట గ్రామసభలో ఇంఛార్జ్ ఎంపీడీవో సునీల్ కుమార్- రాజు, స్పెషల్ ఆఫీసర్ సౌజన్య పాల్గొన్నారు. ఈ నెల 26న ప్రభుత్వం అమలు చేయనున్న నాలుగు పథకాలకు అర్హులైన లబ్ధిదారులను, పారదర్శకంగా ఎంపిక చేయడానికి గ్రామ సభ ఏర్పాటు చేశామని మండల అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.