NZB: ఆంధ్రప్రదేశ్ తెలుగు భాష రక్షణ వేదిక మాజీ అధ్యక్షుడు పొట్లూరి హరికృష్ణ ఆధ్వర్యంలో డిసెంబర్ 27, 28 తేదీల్లో విజయవాడలో జరగనున్న ప్రపంచ తెలుగు కవుల సమ్మేళనానికి NZB జిల్లాకు చెందిన రచయిత ప్రేమ్ లాల్ ఆహ్వానం అందుకున్నారు. ప్రపంచ తెలుగు కవుల సమ్మేళనానికి పిలుపు రావడం పట్ల ప్రేమ్ లాల్ ఆనందం వ్యక్తం చేశారు. సాహితీ మిత్రులు శ్రేయోభిలాషులు అభినందనలు తెలిపారు.