NRML: కుబీర్ మండలం పార్డి (కె) గ్రామాన్ని ఎంపీఓ ఆష్టం భీమేష్ సోమవారం సందర్శించారు. గ్రామపంచాయతీ కార్యాలయంలోని రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం, ప్రభుత్వ పాఠశాలను సందర్శించి విద్యార్థుల హాజరు, వసతులపై ఆరా తీశారు. గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుపరచాలని, రికార్డులను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని సిబ్బందిని MPO ఆదేశించారు.
Tags :