NLG: మిర్యాలగూడ మండలం జంకు తండాలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు పాల్గొన్నారు. సర్పంచ్ అభ్యర్థి ధనావత్ పోలి సూర్య నాయక్తో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చి, ఓటర్లను అభ్యర్థించారు. ఈ ప్రచారంలో మాజీ సర్పంచ్ రవీందర్ నాయక్ సహా పలువురు నాయకులు పాల్గొన్నారు.