MNCL: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి మొదటి ప్రాధాన్యత ఇస్తుందని ఎమ్మెల్యే బొజ్జు పటేల్ అన్నారు. జన్నారం మండలంలోని ఇంధనపల్లి గ్రామ ఊర చెరువులో ఇవాళ అధికారులు, నాయకులతో కలిసి చేప పిల్లలను వదిలారు. MLA మాట్లాడుతూ.. అన్ని కులాల వారి సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని, ప్రభుత్వ పథకాలను అందరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.