NRML: జూనియర్ కళాశాల విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి మధ్యాహ్నం భోజన పథకాన్ని అమలు పరుస్తానని ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డికి అధ్యాపకులు కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం నిర్మల్ జిల్లా ఇంటర్మీడియట్ వాల్యుయేషన్ క్యాంపులో ఆయన చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ మేరకు విద్యార్థులకు ఆకలి ఇబ్బందులు దూరం కానున్నాయని వారు తెలిపారు.