HNK: ఈనెల 8వ తేదీ నుంచి 13వ తేదీ వరకు జరిగే జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ ఎస్సై రాజు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. రాజీ పడదగిన క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు, భూ తగాదాలు, ఇతర కేసులను పరిష్కరిస్తారని, కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.