SRCL: వేములవాడ పట్టణం 12వ వార్డ్‌లో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ మహోత్సవంలో మున్సిపల్ ఛైర్మన్ పుల్కం రాజు పాల్గొన్నారు. లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపి, నూతన వస్త్రాలు అందజేశారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చొరవతో వేములవాడ మున్సిపాలిటీలో ఇప్పటి వరకు 484 మందికి ఇళ్లు మంజూరు అయ్యాయని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేందుకు కృషి చేస్తామన్నారు.