WNP: కాంగ్రెస్ పార్టీ శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజల మోసం చేస్తుందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లాలోని పలు వార్డులలో తిరుగుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాలను ప్రజలకు కాంగ్రెస్ బాకీ కార్డు ద్వారా వివరించారు. ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాలను గుర్తించి భవిష్యత్తులో సరైన నిర్ణయం తీసుకోవాలన్నారు.