JN: పాలకుర్తి మండలం బమ్మెర గ్రామంలో హృదయాన్ని హత్తుకునే ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గుడికందుల సదానంద చారి అనారోగ్య కారణాలతో బుధవారం మృతి చెందారు. ఆయనకు ముగ్గురు కూతుళ్లు ఉండగా,వారసుడు అంటే కేవలం కొడుకే కాదు కూతురు కూడా అని నిరూపిస్తూ పెద్ద కూతురు ముందుకు వచ్చి తండ్రి పార్థివ దేహానికి తలకొరివి పెట్టింది. గ్రామస్థులు ఆమె ధైర్యాన్ని అభినందించారు.