NRML: కడెం ప్రాజెక్టు, కాలువల సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు అన్నారు. బుధవారం ఉట్నూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇరిగేషన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కడెం ప్రాజెక్టుకు మహర్దశ తీసుకువచ్చేందుకు కాల్వల మరమ్మతులకు అటవీ ఇబ్బందులు ఎదురవుతున్నాయని అధికారులు ఆయన దగ్గరికి తీసుకొచ్చారు.