KNR: శంకరపట్నం మండలం తాడికల్‌లో విద్యుత్ శాఖ “ప్రజా బాట” కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా రైతులకు విద్యుత్ భద్రతపై అవగాహన కల్పించారు. బావుల వద్ద ప్లాస్టిక్ బాక్స్‌లు వాడాలని, ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నా లేదా కరెంట్ వైర్లు వేలాడినా వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. లైన్ ఇన్స్పెక్టర్ ఏ. సమ్మయ్య, రాజిరెడ్డి, కుమార్, సంపత్ పాల్గొన్నారు.