MNCL: కూలి పనికి వెళ్లిన దగ్గర ఇద్దరు మహిళలకు మాట మాట పెరిగి గొడవకు దారి తీసింది. గురువారం జరిగిన గొడవలో కాసిపేట మండలం మామిడిగూడేనికి చెందిన సుజాత గాయపడింది. స్థానికుల సాయంతో ఆమెను మందమర్రి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లగా వైద్యులు ప్రథమ చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం ఆమెను మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.