ఉమ్మడి వరంగల్ జిల్లా TG NPDCL పరిధిలో విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగుల చేపట్టిన నిరవధిక సమ్మె ఇవాళ 9వ రోజుకు చేరుకుంది. ఇప్పటికే యాజమాన్యం సమ్మె నిర్వహిస్తున్న ఉద్యోగులందరూ విధుల్లో చేరాలని నోటీసులు జారీచేసిన విషయం తెలిసిందే. అయినా ఉద్యోగులు వెనక్కి తగ్గకుండా సమ్మె నిర్వహిస్తున్నారు. అధికారులు చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నారు.