KNR: కరీంనగర్ LMD రిజర్వాయర్ దిగువన నిర్మాణంలో ఉన్న “మానేరు రివర్ ఫ్రంట్” పనులను జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా పరిశీలించారు. మున్సిపల్, రెవెన్యూ, నీటిపారుదల శాఖ, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి రివర్ ఫ్రంట్ బ్యారేజీ నిర్మాణ స్థలాన్ని సందర్శించారు. రివర్ ఫ్రంట్ నిర్మాణ అంచనా వ్యయం, పూర్తిచేసిన పనుల వివరాలు, చేయవలసిన నిర్మాణాలు తదితర అంశాలను వివరించారు.