RR: హయత్ నగర్ నుంచి గణపతులను ట్యాంక్ బండ్ తీసుకెళ్లడం కోసం ప్రత్యేక రూటును రాచకొండ పోలీసులు సిద్ధం చేశారు. హయత్ నగర్, ఎల్బీనగర్ క్రాస్ రోడ్డు, కొత్తపేట, దిల్సుఖ్ నగర్, టీవీ టవర్, ముసారాం బాగ్ మీదుగా డైరెక్ట్ ట్యాంక్ బండ్ వెళ్ళొచ్చని తెలిపారు. ఈ రూట్లో భారీ వాహనాలకు, ప్రైవేటు బస్సులకు అనుమతి లేదన్నారు.