హైదరాబాద్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) తొలి రోజు సమావేశం ముగిసింది. దేశంలోని తాజా రాజకీయ పరిణామాలు, తెలంగాణ(Telangana)లో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికలు, 2024 లోక్ సభ ఎన్నికలు, మణిపూర్, అల్లర్లు, చైనాతో సరిహద్దు సమస్య, ఇండియా కూటమిలో సీట్ల పంపిణీపై తొలిరోజు సమావేశాల్లో నేతలు చర్చించినట్లు తెలుస్తోంది. జమిలి ఎన్నికలను CWC వ్యతిరేకించింది. త్వరలో జరిగే 5 రాష్ట్రాల ఎన్నికలపై రేపటి సమావేశంలో చర్చించనుంది.భారత దేశం అంతర్గతంగా, బహిర్గతంగా అభద్రతను, సవాళ్లను ఎదుర్కొంటున్నదని కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిందంబరం (P. Chindambaram) అన్నారు. దేశంలో నెలకొన్న పరిస్థితులపై సీడబ్ల్యూసీలో చర్చించామని చెప్పారు.
మణిపూర్(Manipur)కు వెళ్లేందుకు ప్రధానికి 2 గంటల సమయం లేదా అని ఆగ్రహం వ్యక్తం ఆయన చేశారు. సమాఖ్య స్ఫూర్తిని ప్రధాని మోదీ ప్రభుత్వం దెబ్బతీస్తున్నదని ఈ సందర్భంగా ధ్వజమెత్తారు. దేశంలో నెలకొన్న పరిస్థితులపై సీడబ్ల్యూసీలో చర్చించామని చెప్పారు. కశ్మీర్(Kashmir)లో ఇప్పటికీ సాధారణ పరిస్థితులు నెలకొనలేదన్నారు. దేశంలో గతంలో ఎన్నడూ లేనంతగా ద్రవ్యోల్బణం (Inflation)పెరిగిపోయిందని, నిరుద్యోగం పెరిగిందన్నారు. దేశం తీవ్రమైన విపత్కర పరిస్థితుల్లోకి వెళ్తోందని అన్ని సూచీలు హెచ్చరిస్తున్నయన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వంలో దేశం దశాబ్దాల వెనక్కి వెళ్తోందన్నారు. చైనా (China) దేశ భూభాగాన్ని ఆక్రమిస్తుంటే మోడీ మాత్రం మరొకలా చెబుతున్నారని మండిపడ్డారు.