CTR: విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను చేరుకోవడానికి నిరంతరం కృషి చేయాలని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ అన్నారు. మదనపల్లి యూత్ కరాటే అండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇటీవల తమిళనాడు రాష్ట్రం ఊటీలో జరిగిన అంతర్జాతీయ కరాటే పోటీల్లో వివిధ పథకాల సాధించిన కరాటే విద్యార్థులు మంగళవారం ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్‌ను కలిశారు.