Posani Krishna Murali: స్కిల్ డెవలప్ మెంట్ కేసులో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు (Posani Krishna Murali) రాజమండ్రి సెంట్రల్ జైలులో ఊచలు లెక్కబెడుతున్నారు. జైలుకెళ్లి ఆయనను చూసిన తర్వాత భువనేశ్వరి మీడియాతో మాట్లాడారు. జైలులో కూడా ఆయన జనం గురించి ఆలోచిస్తున్నారని తెలిపారు. ఇదే అంశంపై పోసాని కృష్ణ మురళి (Posani Krishna Murali) స్పందించారు. భువనేశ్వరి వ్యాఖ్యలను ఖండించారు.
ఆ రోజు ఎన్టీఆర్‌ను చెప్పులతో కొట్టించింది కూడా ప్రజల కోసమేనా..? మీ నాన్నను వెన్నుపోటు పొడిచింది ఎవరి కోసం..? అని అడిగారు. ఎన్టీఆర్ పదవీని చంద్రబాబు అక్రమంగా లాక్కున్నారని గుర్తుచేశారు. ఆ నాటి సంగతులను భువనేశ్వరి మరచిపోయారా అని ప్రశ్నించారు. ఆ నాడు కాంగ్రెస్ పార్టీ చంద్రబాబుకు ఎమ్మెల్యే సీటు, మంత్రి పదవీ ఇచ్చిందని గుర్తుచేశారు. మరీ టీడీపీలోకి ఎందుకు వచ్చారు.. ప్రజల కోసమేనా అని అడిగారు. ఓటుకు నోట్లు ఇస్తూ ఆడియోలతో దొరికింది కూడా ప్రజల కోసమేనా అని అడిగారు.
రాజమండ్రి జైలు సూపరింటెండెంట్ మార్పు గురించి ఎల్లో మీడియా కథనాలపై పోసాని రియాక్ట్ అయ్యారు. రాహుల్ భార్య అనారోగ్యతో చనిపోయిందని.. కానీ పిచ్చి రాతలు రాస్తున్నారని ధ్వజమెత్తారు. అందుకే లీవ్ పెట్టారని.. వేరే అధికారికి బాధ్యతలు అప్పగించారని తెలిపారు. కానీ ఎల్లో మీడియా మాత్రం ఏదేదో ఊహించుకొని వార్తలు రాస్తుందని ధ్వజమెత్తారు. రాజమండ్రి జైలు కొత్త జైలర్ రవికిరణ్‌కు చెడు చరిత్ర లేదని పోసాని కృష్ణమురళి అన్నారు.