Nara Lokesh: ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ దొంగ అని దుయ్యబట్టారు. 38 కేసుల్లో ఏ1గా ఉండి చంద్రబాబుపై తప్పుడు కేసు నమోదు చేశారని ఆరోపించారు. ములాఖత్ మిలాఖత్ అనే జగన్ డైలాగులను లోకేశ్ ప్రస్తావించారు. చంచల్ గూడ జైలులో ములాఖత్ మరిచిపోయావా అని అడిగారు.
ఉర్దూలో ఓ సామెతను గుర్తుచేశారు. ఉల్టా చోర్ కొల్వాల్ కో డాంటే.. అంటే ఓ దొంగ పోలీసును దొంగ దొంగ అని తరిమాడు అనే అర్థం వస్తోంది. గజదొంగ జగన్ తీరు చూస్తే అలానే ఉంది. 2019 ఎన్నికల్లో టీడీపీని ఓడించడానికి తెరవెనుక అయిన మిలాఖత్ గుర్తులేదా అని అడిగారు. అవినీతిపరులు నీతిమంతులకు కరప్షన్ అంటగట్టడం మానసిక రుగ్మత. దీనిని మెగాలొమేనియా డిజార్టర్ అంటారని గుర్తుచేశారు. బాబు అరెస్ట్ అయిన తర్వాత లండన్‌లో వైద్యం చేయించుకున్నారని ఆరోపించారు.
బాబాయ్‌పై గొడ్డలి వేటు వేసి.. వెన్నుపోటు అనే పదం ఉచ్చరించేందుకు అనర్హుడివి అని లోకేశ్ అన్నారు. జగన్ చేసిన దోపిడీలకు సంబంధించి కోర్టు విచారణకు పదేళ్లుగా ఎందుకు హాజరుకావడం లేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గత 45 ఏళ్లుగా నిబద్ధతతో రాజకీయాలు చేస్తోన్న చంద్రబాబును (Chandrababu) జైలులో వేశావు.. నీ బాబే.. మా బాబును ఏం చేయలేదు. 38 కేసుల్లో నిందితుడివి నువ్వెంత అని మండిపడ్డారు. అవినీతిపై ఆధారాలు ఉంటే కోర్టులో వేయలేదు అని అడిగారు.
అవినీతి జరగలేదని ఆధారాలు ఇచ్చాం.. కరప్షన్ జరిగిందని చూపించే ఒక్క ఆధారం మీ వద్ద ఉందా అని అడిగారు. సొంత బాబాయ్‌ను చంపేశావ్, తల్లిని తరిమేశావ్, చెల్లిని బెదిరించావ్, ప్రజల సొమ్ము అడ్డంగా దోచేశావ్.. సొంత ఇంట్లో వాళ్లకి బిడ్డ కాలేని గజ దొంగ జగన్.. జనం ధన, మాన ప్రాణాలు తీస్తూ అందరికీ ఎలా బిడ్డ అవుతాడో చెప్పాలని లోకేశ్ (lokesh) ప్రశ్నించారు.