HYD: దీపావళి పండుగ వేళ రద్దీలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలలో బంగారం దొంగతనం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి 17 గ్రాముల బంగారం, రెండు మొబైల్ ఫోన్స్, బంగారు ఆభరణాలు, మొత్తం కలిపి రూ.2.33 లక్షల విలువచేసే సామాగ్రి సీజ్ చేసినట్లుగా అధికారులు వెల్లడించారు. వివిధ సెక్షన్ల కింద అతనిపై కేసులు నమోదు చేశారు.