CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కారు ప్రమాదానికి గురైంది. తృటిలో ప్రమాదం తప్పింది. ముఖ్యమంత్రి కాన్వాయ్‌లోని ల్యాండ్ క్రూయిజర్ కారు టైర్ పంక్చర్ అయి పేలింది. కారు సడెన్‌గా ఆగింది. దీంతో పోలీసులు ఉలిక్కిపడ్డారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి కొడంగల్ వెళ్తున్నారు. రేవంత్ రెడ్డి కొడంగల్‌లో మండలాలవారీగా కాంగ్రెస్ నేతలతో సమావేశం కారణంగా కారులో వెలుతున్నారు. ఇందుకోసం ఆయన కొడంగల్ వెళ్తున్న సమయంలో వికారాబాద్ జిల్లా మన్నెగూడ వద్ద కారు టైర్ పంక్షన్ అయింది. కాన్వాయ్‌లోని వారికి ఎవరికీ ఏమీ కాకపోవడంతో పోలీసులు ఊపిరి తీసుకున్నారు.