»Cm Is Sure To Sell The State In Six Months Jeevan Reddy
Jeevan Reddy : ఆరు మాసాల్లో రాష్ట్రాన్ని సీఎం అమ్మడం ఖాయం : జీవన్ రెడ్డి
తెలంగాణలో జీవో 111 రద్దు నిర్ణయంపై ఎమ్మెల్సీ, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి (Jeevan Reddy) తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం కోసమే జీవో 111 రద్దు నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు.
ఆరు నెలల్లో తెలంగాణ(Telangana)ను అమ్ముకోవాలని సీఎం కేసీఆర్ (CM KCR) లక్ష్యంగా పెట్టుకున్నారని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆరోపించారు. ట్రిపుల్ వన్ జీవో పరిధిలోని భూములు అన్నీ రైతుల చేతుల్లో నుండి బడా బడా వ్యాపార వేత్తలు, బీఆర్ఎస్ (BRS) నాయకుల చేతుల్లోకి వెళ్లిపోయాయని, వారి కోసమే జీవో 111ను రద్దు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన విమర్మించారు. బీఆర్ఎస్ నాయకుల చేతుల్లోకి వెళ్లిపోయాయని, వారి కోసమే జీవో 111ను రద్దు నిర్ణయం తీసుకున్నట్లు ఆరోపించారు. చెరువులన్నీ కబ్జా చేయడమే బీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. హైదరాబాద్ (Hyderabad) జంట జలాశయాలను ఎలా కాపాడతారో చెప్పాలని డిమాండ్ చేశారు.ట్రిపుల్ వన్ జీవో రద్దుతో ప్రధానంగా లాభపడేది రాజకీయ నాయకులు, భూస్వాములు, వ్యాపారస్తులు. 84 గ్రామాల పరిధిలో ఉన్న భూముల్లో 50 శాతానికి పైగా క్రయవిక్రయాలు ఇప్పటికే జరిగిపోయాయి. లక్ష ఎకరాలకు నాలా కన్వర్ట్ చేస్తే 10 వేల కోట్ల రూపాయలకు పైగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. లక్ష ఎకరాల్లో ప్రభుత్వం(Govt) భూమి 30 వేల ఎకరాలు ఉంది. 30 వేల ఎకరాలను అలాట్మెంట్ పేరుతో అమ్ముకుంటే మరో 50 వేల కోట్ల రూపాయలు వస్తాయి. మళ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో చెప్పలేం కాబట్టి ఈ 6 మాసాల్లోనే తెలంగాణ రాష్ట్రాన్ని అందినకాడికి అమ్ముకుని పోవాలన్నదే కేసీఆర్ లక్ష్యంగా కనిపిస్తోందని జీవన్‌రెడ్డి (Jeevan Reddy) తెలిపారు