VKB: బషీరాబాద్ మండల పరిధిలోని కొత్లాపూర్‌లో మంగళవారం గ్రామ పంచాయతీ ప్రత్యేక సభ నిర్వహించారు. సర్పంచ్ రాగిణి బాయి, సెక్రటరీ విశాల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఉపాధి హామీ (MGNREGS) పనులపై సుదీర్ఘంగా చర్చించారు. కూలీలకు క్రమం తప్పకుండా పని కల్పించడం, పెండింగ్‌లో ఉన్న బిల్లుల చెల్లింపులు, కొత్తగా చేపట్టబోయే సివిల్ పనుల గురించి గ్రామస్తులకు వివరించారు.