MBNR: బీసీలకు కల్పించిన రిజర్వేషన్లను రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలని బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ ఛైర్మన్ డాక్టర్ యుగంధర్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 23న మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో “బీసీ రణభేరి” సభను భారీ స్థాయిలో నిర్వహించనున్నట్లు తెలిపారు.