BHNG: యాదగిరిగుట్ట పోలీసులు తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. పాతగుట్ట మార్గంలోని సాయిబాబా గుడి వద్ద దిక్కుతోచని స్థితిలో ఉన్న పద్మ అనే వృద్ధురాలిని గమనించిన పోలీసులు, ఆమెకు కొత్త వస్త్రాలను అందించి భోజన సౌకర్యం కల్పించారు. కేవలం శాంతిభద్రతలే కాకుండా, ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటూ సమాజానికి ఆదర్శంగా నిలిచిన పోలీసుల తీరుపై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు.