VKB: జిల్లా పోలీస్ శాఖలో అత్యుత్తమ ప్రతిభకనబరిచి, విధుల్లో విశిష్ట సేవలు అందించిన 7 గురు పోలీసు అధికారులకు, సిబ్బందికి జిల్లా ఎస్పీ కె.నారాయణ రెడ్డి ఘనంగా సన్మానం చేశారు. 2025 రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం ప్రకటించిన రాష్ట్ర స్థాయి పోలీస్ సేవా పతకాలను ఎస్పీ శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో వారికి అందజేశారు.