GDWL: గద్వాల్ రైల్వే స్టేషన్ పార్కింగ్ సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. రోజువారీ ఛార్జీల కంటే రెట్టింపు వసూలు చేస్తున్నారని వాహనదారులు అంటున్నారు. 24 గంటల పార్కింగ్‌కు రూ.32 ఉండగా రూ.60 తీసుకుంటున్నారని వాహనదారులు ఆరోపిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపించడంతో ఈ అక్రమాలు జరుగుతున్నాయని వాపోతున్నారు.