BHNG: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి బుధవారం రూ.28,76,141 ఆదాయం వచ్చినట్లు ఈవో భవాని శంకర్ తెలిపారు. ప్రసాద విక్రయాల ద్వారా రూ.11,55,210, వీఐపీ దర్శనాలతో రూ.4,18,650, కార్ పార్కింగ్ రూ.4,63,000, బ్రేక్ దర్శనాలు రూ.2,20,200, ప్రధాన బుకింగ్లతో రూ.1,49,350 చొప్పున ఆదాయం సమకూరింది. నిత్య ఖజానాకు వివిధ విభాగాల నుండి ఈ నిధులు వచ్చాయని ఆయన పేర్కొన్నారు.