KMM: తన ప్రాణాలను అడ్డుపెట్టేయినా బీఆర్ఎస్ కార్యకర్తలను రక్షించుకుంటానని పాలేరు మాజీ MLA కందాల ఉపేందర్ రెడ్డి అన్నారు. సోమవారం నేలకొండపల్లి (M) కొత్త కొత్తూరులో జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మాట్లాడారు. తన దగ్గర డబ్బులు లేకపోయినా పేదవాళ్లకు సహాయం చేస్తానని చెప్పారు. మీరు ఒక్క దెబ్బ కొడితే మేము రెండు దెబ్బలు కొట్టి చూపిస్తామన్నారు.