WGL: లోక్సభలో జన్ విశ్వాస్ (సవరణ) బిల్లును వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య వ్యతిరేకించారు. ఈ బిల్లులో కీలక నిబంధనలను డీక్రిమినలైజ్ చేయడం వల్ల నియంత్రణ వ్యవస్థ బలహీనపడే ప్రమాదం ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా ఆరోగ్యం, పర్యావరణం, కార్మిక హక్కులపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని హెచ్చరిస్తూ, బిల్లుపై విస్తృత చర్చ జరిపించాలన్నారు.