ADB: రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ ఇచ్చోడ మండలం ముఖరా(K) గ్రామంలో రైతులు కాంగ్రెస్ బాకీ కార్డులు పట్టుకొని శనివారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ జరగలేదన్నారు. వృద్ధులు, దివ్యాంగులకు రూ. 4వేల పెన్షన్ అందజేయాలన్నారు. హామీలను నెరవేర్చకుంటే ఎన్నికల్లో బుద్ధి చెబుతామని పేర్కొన్నారు.