SDPT: గజ్వేల్ మండలం అహ్మదీపూర్ గ్రామానికి చెందిన ఆందోలు గణేష్‌కు వైద్య ఖర్చుల నిమిత్తం మంజూరైన రూ.2 లక్షల ఎల్వోసీ పత్రాన్ని మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ మాదాసు శ్రీనివాస్ అందజేశారు. కేసీఆర్, ఎమ్మెల్సీ యాదవరెడ్డి సహకారంతో సర్పంచ్ బ్యాగారి ప్రభాకర్‌తో కలిసి ఈ సాయం అందించారు. పేదలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యమని వారు పేర్కొన్నారు.