NZB: మోపాల్ మండలం మంచిప్పలో పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో అవగాహన సదస్సును గురువారం రాత్రి నిర్వహించారు. రోడ్డు భద్రతా, మాదకద్రవ్యాల నియంత్రణ, మహిళల రక్షణ, మూఢ నమ్మకాలు, సైబర్ నేరాలు మొదలైన అంశాలపై పాటల రూపంలో ప్రజలకు అవగాహన కల్పించారు. ఎస్సై సుస్మిత మాట్లాడుతూ.. మద్యం తాగి వాహనాలు నడపకూడదని సూచించారు.