ASF: సిర్పూర్(టి) మండల కేంద్రంలోని తథాగత్ బుద్ధ భవనంలో మే 1వ తేదీన సిద్ధార్థ గౌతమ బుద్ధ జయంతి వేడుకలను నిర్వహిస్తున్నట్లు బుధవారం ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. శాంతియుత మార్గాన్ని ఎంచుకొని జ్ఞ్యానోదయం పొందిన గొప్ప మేధావి గౌతమ బుద్ధుడు అని పేర్కొన్నారు. దీంతో ప్రజలు, బౌద్ధులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనీ వారు కోరారు.