TPT: కడూరు గ్రామంలో నిర్వహించిన ‘స్వచ్చపథం’ కార్యక్రమంలో ఎంపీడీవో విజయమ్మ, డిప్యూటీ ఎంపీడీవో శివకుమార్ పాల్గొన్నారు. గ్రామ పరిశుభ్రతతో పాటు ప్రజల్లో బాధ్యతాభావాన్ని పెంపొందించేందుకు అవగాహన కల్పించారు. అధికారులు స్వయంగా సమస్యలను గుర్తించి పరిష్కార చర్యలు చేపట్టడంతో గ్రామస్తుల్లో నమ్మకం పెరిగింది. ప్రజల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం విజయవంతమైంది.