VZM: గజపతినగరంలోని అన్న క్యాంటీన్‌ను జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన క్యాంటీన్ పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించి, పరిశుభ్రత పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. క్యాంటీన్ నిర్వహణ తీరును పర్యవేక్షించిన కలెక్టర్, అక్కడ అందుతున్న భోజన నాణ్యతపై ప్రత్యేకంగా ఆరా తీశారు. క్యాంటీన్ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు.